గేమ్ ఛేంజ‌ర్ నుంచి క్రేజీ అప్‌డేట్

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, స్టార్ డైరెక్ట‌ర్‌ శంకర్ దర్శకత్వంలో వ‌స్తున్న మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలున్నాయి. మ‌రో వైపు ఈ మూవీ నుంచి త‌ర‌చూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మేక‌ర్స్ ఫ్యాన్స్ ను ఉర్రూత‌లూగిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు సూప‌ర్ సాంగ్స్ ను విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి మ‌రో సాంగ్ రిలీజ్ చేశారు. ‘నానా హైరానా’ అని సాగే ఈ సాంగ్ ప్రోమో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. ప్రముఖ సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ రొమాంటిక్ మెలోడీని వారి స్పెషల్ బైట్స్ తో రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *