బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ సూపర్ హిట్లతో స్టార్ హీరోయన్ గా దూసుకుపోతోంది. ధోనీ, లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో బ్లాక్బాస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో ఇటీవల రామ్ చరణ్‌తో పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ లో అదరగొట్టింది. ఇక అన్ని సినీ పరిశ్రమల్లో అభిమానులను సంపాదించుకోవడంతో కియారాకు వరుసగా పాన్ ఇండియా మూవీ అవకాశాలు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో రెండు పాన్ ఇండియా సినిమాల్లో కియారా నటిస్తోంది. ఇందులో ఒకటి ‘వార్ 2’ కాగా, మరొకటి టాక్సిక్. వార్ 2 లో హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా హృతిక్‌కు జోడీగా కనిపించనున్నట్లు సమాచారం. కేజీఎఫ్ స్టార్ యశ్ తో టాక్సిక్ మూవీలో కియారా నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అయితే కియారాకు తిరుగులేనట్టే.