నేడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తన ఎక్స్ ఖాతాలో స్టాలిన్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఇటాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మీరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ మోడీ తన పోస్టులో పేర్కొన్నారు. స్టాలిన్ 72వ పుట్టిన రోజు సందర్భంగా డీఎంకే నేతలు తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.