ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కల్పన ఆత్మహత్యకు యత్నించారు. దీనికి ఆమె రెండో భర్తే కారణంగా భావిస్తున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సింగర్ కల్పన హైదరాబాద్‌లోని నిజాంపేట రోడ్డులోని ప్రీ విలేజ్ విల్లాస్‌లో ఉంటున్నారు. గత రెండు రోజుల నుంచి ఆమె ఇంటి తలుపులు తీయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన పక్క ఇంటి వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కల్పన ఇంటికి చేరుకొని తలుపులు తీసి చూడగా కల్పన అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స అనంతరం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రెండో భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కల్పన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరో వైపు టాలీవుడ్ నుంచి పలువురు సింగర్స్, నటులు కల్పనను పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూ కట్టారు.