ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ఛాన్స్ కొట్టేసిన కీర్తి!

మ‌హాన‌టి కీర్తి సురేష్ పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల జోరు త‌గ్గించ‌లేదు. ఇటీవ‌ల బేబీ జాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ అక్క, రివాల్వర్‌ రీటా సినిమాలు చేస్తోంది.ఈ ప్రాజెక్టులు కొన‌సాగుతుండ‌గానే కీర్తి హిందీలో మరో ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ కొత్త సినిమాలో కీర్తి హీరోయిన్ గా సెలెక్ట్ అయిన‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రూ జోడీగా మంచి రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ కీర్తి వ‌రుస ఛాన్సులు అందుకుంటూ బాలీవుడ్‌లో పాగా వేయ‌నుంద‌ని నెట్టింట్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ర‌ణ‌బీర్ సినిమాలో కీర్తి సెలెక్ట్ అయ్యిందా లేదా అనేది అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *