వేముల‌వాడ‌లో హిజ్రాల క‌ల్యాణం

వేముల‌వాడ‌లో శివ క‌ల్యాణం వేడుక‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ఏటా శ్రీరామ న‌వ‌మి స‌మ‌యంలో శివ క‌ల్యాణం జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలో ఆలయంలో ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలు వివాహం చేసుకుంటారు. ఈ వేడుకలో హిజ్రాల వివాహాలు ఆచారంగా వ‌స్తున్నాయి. అందంగా ముస్తాబై, శివపార్వతులు,శివసత్తులు మదిలో స్వామివారిని స్మరించుకుంటూ తలపై జిలకర బెల్లం పెట్టుకొని, తలంబ్రాలు పోసుకుంటూ ఒకరికొకరు తాళిబొట్లు కట్టుకొని వివాహం చేసుకుంటారు. ఈ స‌మ‌యంలో ఆల‌య ప‌రిస‌రాల‌న్నీ హిజ్రాల‌తో సంద‌డిగా మార‌తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *