త‌మ‌న్‌కు బాల‌య్య స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్‌కు న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఓ ఖ‌రీదైన బ‌హుమ‌తిని ఇచ్చారు.బాల‌కృష్ణ న‌టించిన‌ అఖండ‌, వీర సింహ రెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకు మ‌హ‌రాజ్ సినిమాకు వ‌రుస‌గా త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో పాటు మ్యూజిక‌ల్ గా స‌క్సెస్ అందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్‌కి బాల‌య్య ఓ స‌ర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. రూ.1.75 కోట్ల విలువ చేసే ల‌గ్జ‌రీ పోర్చే కారును త‌మ‌న్‌కు కానుక‌గా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *