మెగా 157 టీంని ప‌రిచ‌యం చేసిన చిరు

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి మ‌రో కొత్త సినిమాను మొద‌లు పెట్టారు. మెగా 157 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప‌ని ప్రారంభించారు. హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్‌ ఇవ్వ‌గా సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ చేసిన సంద‌ర్భంగా మెగాస్టార్ ఒక వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ వీడియోలో మూవీ టీం ను ప‌రిచ‌యం చేస్తూ మెగా 157ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేద్దామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వేడుక‌లో నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌ రాజు, నాగవంశీ, దర్శకులు వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్‌ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *