అఖిల్ పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నాగార్జున‌

ఇటీవ‌ల అక్కినేని నాగార్జున చిన్న‌ కుమారుడు అఖిల్‌కు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య సైతం పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. దీంతో తండ్రిగా నాగార్జున ఆనందానికి అవ‌ధుల్లేకుండాపోయాయి. దీనిపై నాగార్జున మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్య‌క్తం చేశారు. ‘‘ఈ ఏడాది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఓవైపు నాన్నగారి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు నా తనయులిద్దరూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ 4న నాగచైతన్య – శోభిత పెళ్లి జరగనుంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నా తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉంది. మా కుటుంబం ఎంతో పెద్దది. అదేవిధంగా శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదే. కుటుంబసభ్యులు, తక్కువమంది అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నాం. మా రెండో అబ్బాయి అఖిల్‌ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. జైనబ్‌ రవ్జీ ఎంతో మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం కలిగిఉంటుంది. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్‌ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదు. ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది’’ అని నాగార్జున తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *