రికార్డులు సృష్టిస్తున్న సంక్రాంతికి వ‌స్తున్నాం..!

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం. మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ ఈ సినిమాలో వెంక‌టేష్‌కు జోడీగా న‌టించారు. సంక్రాంతికి విడుద‌లైన సినిమాల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో టీం స‌క్సెస్ అయ్యింది. అలాగే ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించింది. ఏకంగా వెంక‌టేష్ కెరీర్‌లోనే బెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నేటితో ఈ సినిమా విడుద‌లై 50 రోజులు పూర్త‌య్యింది. అయినా సుమారు 92 థియేట‌ర్ల‌లో ఇంకా కొన‌సాగుతోంది. దీనిపై మూవీ టీం సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా రాబ‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *