టాలీవుడ్‌లో క‌మిట్‌మెంట్ల‌పై అన‌న్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌కీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా అంత‌గా ఆమెకు గుర్తింపు ద‌క్క‌లేదు. కానీ యూత్‌లో అన‌న్య‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో ఒక‌రు మిమ్మల్ని ఎవరైనా కమిట్‌మెంట్‌ అడిగారా అని అన‌న్య‌ను ప్ర‌శ్నించారు. స‌ద‌రు జర్నలిస్ట్ వ్యాఖ్యలకు అన‌న్య ఓపిక‌గా సమాధానం ఇచ్చింది. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా’’ అని చెప్పారు. మ‌రో సంద‌ర్భంగా అన‌న్య‌ ఈ విషయంపై మాట్లాడుతూ ‘ కొన్ని ప్రశ్నలకు మనం సంస్కారంతో ఆన్సర్ చేయాలి. ఎదుటివారికు అది ఉన్న లేకున్నా మన లిమిట్స్ లో మనం ఉండి చేయాలి నేను అదే చేశాను. ఇక ఈ విషయంలోనాకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *