ఫ్యాన్స్ కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌!

కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అక్కినేని వార‌సుడు అఖిల్ హీరోగా వ‌చ్చిన మ్యూజిక‌ల్ హిట్ మూవీ ‘హలో’తో ఈ అమ్మ‌డు తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా అంత హిట్ అవ్వ‌క‌పోయినా క‌ల్యాణికి మాత్రం మంచి పేరే వ‌చ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి చిత్రలహరి అనే సినిమా తీసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. క‌ల్యాణికి మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ అవ్వ‌డం నిరాశ ప‌ర్చింది. తర్వాత ఈ ముద్దుగుమ్మ‌ పూర్తిగా తెలుగు సినిమాలకు దూర‌మైంది. ప్రస్తుతం తమిళ్‌, మలయాళంలో వరుస హిట్ల‌తో దూసుకెళ్తోంది. మలయాళ నటుడు మోహన లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన హృదయం సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. ఇక సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌ల్యాణి రీసెంట్‌గా ఓ వీడియో షేర్ చేసి అంద‌రికీ షాకిచ్చింది. అందులో కొత్త పెళ్లి కూతురుగా అందంగా క‌నిపిస్తోంది. ఇక పెళ్లి కొడుకు ఓ సీరియ‌ల్ న‌టుడు కావ‌డం విశేషం. కస్తూరిమాన్ సీరియల్ ద్వారా తమిళ బుల్లితెర ప్రేక్షకుల ప్రశంసంలు అందుకున్న శ్రీరామ్, కళ్యాణి ఈ వీడియోలో పెళ్లి బట్టలతో దర్శనమిచ్చారు. న‌టుడు శ్రీరామ్ ఆ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ‘అవును. ఈ క్షణాలు మమ్మల్ని సంతోషపరుస్తాయి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో స‌ద‌రు న‌టుడు అసలు విషయం బ‌య‌ట‌పెట్టాడు. అది ఓ వెడ్డింగ్ కలెక్షన్స్ యాడ్ కోసం చేసిన షూట్ అని అస‌లు విష‌యం చెప్పాడు. దీంతో ఇది నిజ‌మైన పెళ్లి కాదా అంటూ నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు.

 

Actress Kalyani Priyadarshan gave a surprise to the fans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *