భ‌ర్త‌తో విడాకుల‌పై మంచు ల‌క్ష్మి కామెంట్స్!

సీనియ‌ర్ హీరో మంచు మోహ‌న్ బాబు వార‌సురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న‌టిగా, నిర్మాత‌గా, హోస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గ్లామ‌ర‌స్ బ్యూటీ మంచు ల‌క్ష్మి. న‌టిగా స‌క్సెస్ కాక‌పోయినా మంచు ల‌క్ష్మి చేసిన ప‌లు ప్రోగ్రామ్స్ తెలుగులో బాగా క్లిక్ అయ్యాయి. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మి త‌ర‌చూ త‌న కూతురికి సంబంధించిన విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాలు త‌న అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. అయితే మంచు ల‌క్ష్మి భ‌ర్త అమెరికాలో ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో వీరిద్ద‌రూ విడిపోయార‌న్న వార్త‌లు త‌ర‌చూ వ‌స్తూ ఉంటాయి. దీనిపై మంచు ల‌క్ష్మి స్పందించారు. త‌న భ‌ర్త , తాను క‌లిసే ఉన్నామ‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం త‌న కూతురు భ‌ర్త‌తోనే ఉంద‌ని, ఉద్యోగ‌రీత్యా దూరంగా ఉన్నా తాము సంతోషంగానే ఉన్నామ‌ని మంచు ల‌క్ష్మి వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *