అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ షాలినీ పాండే. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా అర్జున్ రెడ్డి తెచ్చిన క్రేజ్ మాత్రం ఏ మూవీ తీసుకురాలేదు. ఇక్కడి నుంచి బాలీవుడ్ వెళ్లిపోయిన షాలినీ అక్కడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. రీసెంట్‌గా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన షాలినీ తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంది. తన సినీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ ఏదైనా మహిళలకు సమస్యలు సాధారణమేనంది. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఓ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తు చేసుకుంది. అయితే తనకు ఇప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసి వచ్చిందని పేర్కొంది. సినీ ప్రేక్షకులు తనను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్‌తో పోలుస్తున్నారని, ఆలియా మంచి నటి అని చెప్పింది. తనకు కూడా ఆలియా అంటే ఇష్టమని అయితే ఆలియాతో పోల్చకుండా తనకు ప్రత్యేకంగా గుర్తిస్తే సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.