ప్ర‌భాస్ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న డ్యాన్స‌ర్ ఇమాన్వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీతారామం లాంటి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటు, ప్ర‌భాస్ ఇందులో న‌టిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే తాజాగా ఓ బాలీవుడ్ న‌టుడు ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇండియ‌న్ సినిమా బాహుబ‌లి ప్ర‌భాస్‌తో స‌రికొత్త చిత్రంలో 544వ ప్రాజెక్టులో న‌టిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తిభావంతుడైన హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో, మైత్రి సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంద‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *