ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో బన్నీకి నేషనల్ వైడ్ స్టార్డమ్ వచ్చింది. ఈ సందర్భంగా పుష్ప-2 గురించి అమితాబ్ మాట్లాడుతూ… పుష్ప-2 సినిమాతో నేను అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యాను.. నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి.. అతను గొప్ప నటుడు అంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బీ కామెంట్స్ తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.