ప్ర‌భాస్‌కు అన్న‌గా బాలీవుడ్ స్టార్ హీరో!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం స్పిరిట్‌. యానిమ‌ల్ సినిమా త‌ర్వాత సందీప్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి విష‌యాలు వెల్ల‌డించ‌లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు అన్న‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. సంజ‌య్ ద‌త్ ప్ర‌భాస్ కు అన్న‌గా న‌టిస్తున్న‌డ‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌ట‌క‌న రాలేదు. మూవీ టీం ఈ వార్త‌ల‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *