నాని సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !

స‌రిపోదా శ‌నివారం హిట్ తో న్యాచుర‌ల్ స్టార్ నాని మంచి హిట్ అందుకున్నాడు. మ‌రిన్ని వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తేడాది ద‌స‌రా సినిమాతో త‌న‌కు బ్లాక్ బాస్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ద‌స‌రా సినిమా నానికి న‌టుడిగా మంచి గుర్తింపు ఇవ్వ‌డంతో పాటు అవార్డులు సైతం అందుకుంది. ఈ కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల ద‌స‌రా పండుగ‌ సందర్భంగా ‘నాని ఓదెల 2’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌పై సినిమా మొద‌లెట్టేశారు. సికింద్రాబాద్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ని స‌మాచారం. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ను తీసుకుందామ‌ని యూనిట్ డిసైడ్ అయింద‌ట‌. ఇప్ప‌టికే దేవ‌ర బ్యూటీ జాన్వీ క‌పూర్‌ని నిర్మాత‌లు సంప్ర‌దించార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రోవైపు శ్ర‌ద్ధాక‌పూర్‌ని కూడి హీరోయిన్‌గా తీసుకునేందుకు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్ద‌రిలో ఎవ‌ర్ని హీరోయిన్‌గా తీసుకున్నా నానికి సూప‌ర్ జోడీగా సెట్ అవుతారు. మ‌రి నాని స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *