కల్కి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరో కొత్త సినిమాకు ప్లాన్ చేసేశాడు. ప్రస్తుతం కల్కి-2 తో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ తర్వాత సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేసేశాడు. నాగ్ అశ్విన్ తర్వాత సినిమాను ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో తీస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ అని టాక్. అయితే దీనికి సంబంధించి మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఓ హీరోయిన్‌ను దీని కోసం సంప్రదించారని, ఆమె కూడా ఒకే చెప్పిందని వినికిడి. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో ఆలియాకు వరుస సినిమా ఆఫర్లు వచ్చినా చేయలేదు. మరి ఈ సినిమా చేస్తుందా లేదా అనేది చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.