అమెజాన్‌లో రానా కొత్త టాక్ షో!

ప్ర‌స్తుతం టాలీవుడ్ టూ హాలీవుడ్ టాక్ షోల ట్రెండ్ న‌డుస్తోంది. సెల‌బ్రెటీలు ఒక వేదిక పైకి వ‌చ్చి త‌మ ప‌ర్స‌న‌ల్ , ప్రొఫెష‌న‌ల్ విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకునే వేదిక‌ల‌కు జ‌నం జై కొడుతున్నారు. బాలీవుడ్‌లో ఈ టాక్ షోలు ఎక్కువ‌గా ఉన్నా తెలుగులో త‌క్కువ‌నే చెప్పాలి. అందులోనూ పెద్ద స్టార్లు హోస్టులుగా ఉండి చేస్తున్న షోలు పెద్ద‌గా లేవు. వీటిలో బాల‌కృష్ణ చేస్తున్న అన్ స్టాప‌బుల్ ఫేమ‌స్ అయ్యింది. ఇప్పుడు సీజ‌న్ టూ గ్రాండ్‌గా న‌డుస్తోంది. ఇది ఆహాలో టెలీకాస్ట్ అవుతోంది. ఇక ప్ర‌ముఖ న‌టుడు రానా దగ్గుబాటి హోస్ట్ గా మ‌రో టాక్ షోకు రంగం సిద్ధ‌మైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ షో ప్రసారం కానుంది. ఈ విష‌యాన్ని అమెజాన్ అధికారికంగా వెల్ల‌డించింది. ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో రానున్న ఈ షో నవంబర్‌ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదని.. అంతకు మించిన సరదా సంభాషణలతో ఇది సాగుతుందని పేర్కొంది. తెలుగులో టాక్ షోలు త‌క్కువ‌గా ఉన్నాయ‌నుకున్న అభిమానుల‌కు ఇప్పుడు రానా షో ఆస‌క్తిని పెంచేస్తోంది. మ‌రి ఈ షో ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *