టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త, తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని కాజల్ 2020లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కాజల్ ఓ బాబుకు జన్మనిచ్చింది. అనంతరం కొద్ది కాలంపాటు సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఒకానొక సమయంలో కాజల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అనే టాక్ వినిపించింది. కానీ బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకొని అందరికీ షాకిచ్చింది. తాజాగా కాజల్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది. మంచు విష్ణు హీరోగా మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్ర కన్నప్ప. దీనికి ముఖేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవీగా కనిపించనున్నారు. కాజల్ ఫస్ట్ లుక్‌ను మూవీ టీం విడుదల చేసింది. కాజల్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితర స్టార్ యాక్టర్లు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు.