టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా విజయవంతంగా కొనసాగుతున్న షో అన్ స్టాపబుల్. ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా వేదికగా ఈ షో నడుస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. ఈ షో నాలుగో సీజన్‌లో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అల్లు అర్జున్, సూర్య, నవీన్ పొలిశెట్టి, వెంకటేశ్, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ ఈ షోకు అతిథిగా హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా చరణ్ ఈ షోతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ షో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.