క‌లెక్ష‌న్ల‌లో గేమ్ ఛేంజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ మైండ్ బ్లోయింగ్ క‌లెక్ష‌న్ల‌తో దుమ్ము లేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల‌లో ఉన్న రికార్డుల‌ను గేమ్ ఛేంజ‌ర్ మార్చేసింది. ఈ మూవీ మొద‌టి రోజు ఏకంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ ప్ర‌క‌టించారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల లిస్టులో గేమ్ ఛేంజ‌ర్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ.294 కోట్లతో మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన మూవీగా పుష్ప‌-2 ఉంది. రూ.223 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆర్ఆర్ఆర్ సెకండ్ ప్లేస్‌కి వెళ్లిపోయింది. ఇక రూ.215 కోట్లతో మూడో స్థానంలో బాహుబలి, రూ.191 కోట్లతో ‘కల్కి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. తర్వాత సలార్ రూ.178 కోట్లు, దేవర రూ.172 కోట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు దేవర, సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేసి గేమ్ ఛేంజ‌ర్‌ రూ.186 కోట్లు రాబట్టి నాలుగో స్థానంలో నలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *