నాపై వ‌చ్చే పుకార్ల‌ను న‌మ్మ‌కండి – సింగ‌ర్ క‌ల్ప‌న

ఇటీవ‌ల నిద్ర‌మాత్ర‌లు మింగి సింగ‌ర్ క‌ల్ప‌న ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఆమె ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు తెలిపారు. కాగా, ఆమె త‌న భ‌ర్త‌తో విబేధాల కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రిగింది. కాగా, దీనిపై సింగ‌ర్ క‌ల్ప‌న ఒక వీడియో విడుద‌ల చేశారు. తాను ఈ వ‌య‌స్సులో కూడా లా చ‌దువుతున్నాన‌ని, పీహెచ్‌డీ చేస్తున్నాన‌ని, సింగ‌ర్‌గా ఇంకా మంచి స్థాయికి ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పారు. ఇదంతా త‌న భ‌ర్త ప్ర‌సాద్ ప్రోత్సాహం వ‌ల్లే సాధ్య‌మ‌వుతోంద‌ని చెప్పారు. ఈ ఒత్తిడిలో కొద్ది రోజులుగా నిద్ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ట్లు చెప్పారు. దీనికి డాక్ట‌ర్ ద‌గ్గ‌ర చికిత్స థెర‌పీ చేయించుకుంటున్నాన‌ని, మందులు కూడా వాడుతున్నాన‌ని చెప్పారు. అయితే ఆ మందుల డోసేజీ పెర‌గ‌డం వ‌ల్ల మ‌త్తులోకి వెళ్లిపోయిన‌ట్లు చెప్పారు. త‌న భ‌ర్త స్వ‌యంగా పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని వెల్ల‌డించారు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు, త‌న భ‌ర్తే కార‌ణ‌మంటూ వ‌స్తున్న పుకార్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *