పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేసినా సెన్సేషన్ అయిపోతోంది. సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా బన్నీ చాలా టైం కేటాయిస్తాడు. బన్నీ భార్య స్నేహారెడ్డి సినీ వేడుకలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటారు. నేడు బన్నీ, స్నేహారెడ్డిలు 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2011 మార్చి 6న వీరి వివాహం జరిగింది. వీరిద్దరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు.