విశ్వ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ హీరోయిన్‌గా సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీ హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకుంది. శ్రుతి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. శ్రుతి మొదట్లో ఫారిన్ అబ్బాయి మైఖేల్ కోర్సలేతో డేటింగ్ యవ్వారం నడిపింది. ఏమైందో ఏమో కొన్నేళ్లకు అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతోనే డేటింగ్ చేసింది. కానీ అతడి నుంచి కూడా ఇటీవల విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి ప్రేమ, రిలేషన్ షిప్, పెళ్లి గురించి తన మనసులో మాట బయట పెట్టింది. లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పింది. ప్రేమలో తలమునకలుగా ఉండడం చాలా బావుంటుందని అయితే పెళ్లి చేసుకొని ఒకరితో అటాచ్ అవ్వాలంటే భయం వేస్తోందని వెల్లడించింది. తన తల్లిదండ్రుల వివాహ జీవితం నుంచే తాను చాలా నేర్చుకున్నట్లు శ్రుతి చెప్పుకొచ్చింది.