మ‌హేశ్ బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై తేజా స‌జ్జా క్లారిటీ!

యంగ్ హీరో తేజా స‌జ్జా ఇటీవ‌ల ఐఫా వేడుక‌లో స్టార్‌ హీరోల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ముఖ్యంగా తేజా మ‌హేశ్ బాబుపై చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై మ‌హేశ్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. దీంతో తేజా త‌న వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. ఐఫా అవార్డు ఫంక్ష‌న్‌ను రానా ద‌గ్గుబాటి, తేజా స‌జ్జ హోస్ట్ చ‌సిన సంగ‌తి తెలిసిందే. ఈ షోలో స‌ర‌దాగా జ‌రిగిన సంభాష‌ణ‌ల్లో ప‌లువురు సినీ హీరోల‌ను ఉద్దేశించి తేజా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై స్పందిస్తూ.. ఐఫా ఓ జాతీయస్థాయి వేడుక.. అవకాశం వస్తే మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తా.. ఐఫా’ అవార్డులకు సినీ పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇదో జాతీయస్థాయి వేడుక. ఎంతోమంది స్క్రిప్ట్‌ రైటర్స్‌ దీనికోసం వర్క్‌ చేస్తుంటారు. అన్నివిధాలా చెక్‌ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు ఇచ్చారు. అదీకాక మీరు చూస్తున్న‌వ‌న్నీ కట్‌ చేసిన క్లిప్స్‌ మాత్రమే. ఫుల్‌ వీడియో చూసి ఉంటే ఎవరికీ ప్రతికూల ఉద్దేశం రాదు. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. అందరి హీరోలతో పనిచేస్తూ పెరిగా. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని తేజ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *