బాహుబలి నుంచి టాలీవుడ్ సినిమాల రేంజ్ మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోస్ చేసే ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక తెలుగు హీరోలతో ఆడిపాడేందుకు బాలీవుడ్ తారలు సైతం క్యూ కడుతున్నారు. ఈ కోవలోనే టాలీవుడ్‌కు వచ్చేందుకు దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రెడీ అయ్యింది. వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా జటాధర. ప్రేరణ ఆరోరా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షి నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేశారు. మరి సోనాక్షికి టాలీవుడ్‌లో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో వేచి చూడాలి.