ఆక‌ట్టుకుంటున్న విశ్వ‌క్‌సేన్ లైలా ట్రైల‌ర్

ఇటీవ‌ల మెకానిక్ రాకీ సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ వ‌రుస సినిమాల‌తో ఫ్యాన్స్ ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రామనారాయణ్ డైరెక్ష‌న్‌లో విశ్వ‌క్ సేన్ హీరోగా వ‌స్తున్న సినిమా లైలా. ఈ మూవీలో విశ్వ‌క్ సేన్ లేడీ గెట‌ప్‌లో కూడా క‌నిపించ‌నున్నారు. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న థియేటర్ల‌లో రిలీజ్ అవ‌నున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. విశ్వ‌క్ లేడీ గెట‌ప్‌లో ఉన్న టీజ‌ర్ విడుద‌ల‌తో మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ టీం లైలా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ మొత్తం ఫుల్ కామెడీగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో విశ్వ‌క్ సేన్ చేస్తున్న కామెడీకి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *