యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

క‌డ‌ప‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ‌తిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ యువ‌తిని స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాళ్లోకి వెళ్తే… బ‌ద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి శనివారం ఉదయం గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ కంపెనీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె సెంచరీ ఫ్లైవుడ్ షాప్ వద్దకు రాగానే ప్రేమోన్మాది విగ్నేష్ ఆ యువతిపై పెట్రోల్ పోశాడు. అనంతరం ఆమె తేరుకునే లోపే నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువతిని బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *