అప్పుల బాధ‌తో హాస్ట‌ల్‌పై నుంచి దూకి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అప్పుల బాధ‌తో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. న‌గ‌రంలోని కోకాపేట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాళ్లోకి వెళ్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త‌ణుకుకు చెందిన నాగ ప్ర‌భాక‌ర్‌(27) అనే వ్య‌క్తి గ‌చ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్ట‌ల్‌లో ఉంటూ కోకాపేట్‌ లోని ఓ సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. నాగ ప్ర‌భాక‌ర్ త‌న ఆర్థిక అవ‌స‌రాల కోసం భారీగా అప్పులు చేశాడు. ఇప్పుడు వాటిని క‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉన్నాడు. కొద్ది రోజులుగా ఈ విష‌య‌మై తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నాడు. ఈ క్ర‌మంలో కోకాపేటలోని విరూపాక్ష హాస్టల్‌కు వ‌చ్చాడు. హాస్ట‌ల్ ఏడో అంతస్తు పై నుంచి కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నార్సింగి పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న మృతుడి సోద‌రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే, గ‌చ్చిబౌలి హాస్ట‌ల్ లో ఉండే నాగ ప్రభాకర్‌ కోకాపేటలోని ఈ హాస్టల్‌ భవనానికి ఎందుకు వచ్చాడ‌న్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *