ప్రముఖ తమిళ నటి జ్యోతిక తిరుమలలో సందడి చేశారు. నేడు ఉదయం ఆమె శ్రీవారి దర్శనానికై తిరుమలకు వచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు.