హ‌రీష్.. నేను నీలాగా దొంగ‌త‌నాలు చేయ‌లేదు

మాజీ మంత్రి హ‌రీష్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్న హ‌రీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి త‌న‌తో గ‌న్ మెన్ లేకుండా మూసీ ప‌రివాహ‌క ప్రాంతానికి రావాల‌ని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ హ‌రీష్ కు కౌంట‌ర్ ఇచ్చారు. మూసీకి వస్తావా.. మురికి వాడికి వస్తావా అని సవాల్ చేస్తున్నారు.. ఇప్పుడు మూసీ పక్కనే ఉన్న నేను.. హరీష్ రావు నీలాంటి చెప్పులు మోసేటోడు పిలిస్తే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో బోర్లా పడుకున్న వారిని రమ్మను నేను వస్తా.. నీదో స్థాయి నీదో బతుకా అంటూ విమ‌ర్శించారు. హరీష్ రావు సంగ‌తి త‌న‌కు తెలుసంటూ, కాంగ్రెస్ దయ తలిస్తేనే గండిపేటలో ఫామ్ హౌజ్ కొనుక్కున్నాడ‌ని వ్యాఖ్యానించారు. హవాయి చెప్పులతో తిరిగి నేడు ఇంత స్థాయికి ఎలా ఎదిగాడో తెలుస‌న్నారు. నేను నీ వెనకాల ఉండి తొంగి తొంగి చూడొచ్చు.. కానీ నీలాగా నేను దొంగతనాలు చేయలేద‌ని సెటైర్లు వేశారు.నా ఇంటి ముందు నిలబడి చేతులు కట్టుకొని బిచ్చమెత్తిన రోజులు మర్చిపోయావా అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ నేత‌లు మూసీ ప‌రివాహ‌క‌ ప్రజల‌ను అడ్డుపెట్టి వాళ్ల‌ ఫామ్ హౌజుల‌ను కాపాడుకునే పనిలో ఉన్నారని విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *