తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పట్నంలో ఉన్న ప్రజలంతా పల్లెలకు చేరుకున్నారు. గ్రామాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ తారలు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ నటులు మంచు మనోజ్ కుటుంబం, మంచు మోహన్ బాబు కుటుంబం భోగి వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.