సీఎం నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ మండిప‌డ్డారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గ‌మ‌న్నారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *