బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. సభాపతి అంటే తమకు ఎంతో గౌరవమని చెప్పారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ ఎంతో సహకరించిందని గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత ఎల్లప్పుడూ సభాపతిని గౌరవించాలని చెప్తారని పేర్కొన్నారు. సభాపతిని అగౌరవపరచాలనన్న ఉద్దేశం తమకు లేదని, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను పునః పరిశీలించాలని కోరారు.