కాంగ్రెస్ పార్టీకి కోనేరు కోన‌ప్ప రాజీనామా

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప పార్టీకి రాజీనామా చేశారు. కోనేరు కోన‌ప్ప మ‌రే పార్టీలో చేర‌న‌ని స్ప‌ష్టం చేశారు. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగానే ఉంటాన‌ని తెలిపారు. 2023 మార్చి 6న కోన‌ప్ప సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంత‌కు ముందు ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగారు. ఏడాది కూడా కాక‌ముందే పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. కాగా, కొద్ది రోజుల నుంచి కోన‌ప్ప‌ కాంగ్రెస్ పార్టీతో విబేధిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ఫ్లై ఓవ‌ర్ అంశ‌మై ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ దొంగ‌ల పార్టీ అని, నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త బిచ్చ‌గాళ్లు ఎక్కువై పోయార‌ని విమ‌ర్శించారు. ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం పూర్తి చేయాల‌ని సీఎంను అడిగినా పూర్తి చేయ‌లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *