నేడు కేసీఆర్ బ‌ర్త్ డే.. కేటీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్

నేడు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత‌లు, ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ త‌న తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. “ప్రతి తండ్రే తమ బిడ్డకు హీరో అని చెబుతారు. మా నాన్న నా ఒక్కడికే కాదు తెలంగాణకే హీరో అయినందుకు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నా. కలలు కనడం, దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరడమే ముఖ్య‌మ‌ని నిరూపించాడు. సొంత జీవితం గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ అనే కలను ప్రేమించి పోరాడి సాధించుకున్నాడు. మీలాగా కొంతైనా సాధించాల‌నేది నా క‌ల. మీరు మీ కొడుకు అని గర్వంగా పిలుచుకునే వ్యక్తిగా ఉండటమే నా ఏకైక లక్ష్యం. ఈ పోరాటానికి, ఈ రాష్ట్రానికి, ఈ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి నా జీవితంలోని ప్రతి ఒక్క క్షణం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నా. మీరు మాకు అందిస్తున్న‌ స్ఫూర్తికి ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న” అని కేటీఆర్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *