కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చాలెంజ్ విసిరారు. డిప్యటీ సీఎం హుజూరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తనను సస్పెండ్ చేస్తానని అంటున్నారని, తన హుజూరాబాద్ నియోజకవర్గంలో 107 గ్రామాలు ఉన్నాయని, ఒక్క గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.