ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు మూసివేస్తామన్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు మాట ఇచ్చినా ఇప్పటికీ బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒకడుగు ముందుకేసి కొందరు ఏకంగా మద్యం డోర్ డెలివరీకే తెర తీశారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ కొందరు మద్యం అమ్ముతున్నారు. ఇటీవల ఇలా హోమ్ డెలివరీ చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీడియోల్ల బండి నంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.