సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అల్లు అర్జున్ బాడీ గార్డ్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్‌ను పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనకు సంబంధించి సుమారు 50 ప్రశ్నలు అడగగా అల్లు అర్జున్ మౌనం వహించారని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలను పోలీసులు బన్నీకి చూపించారని సమాచారం. దీంతో పాటు సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జన్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకొస్తారని తెలుస్తోంది.