రేపు హైద‌రాబాద్‌లో మందు బంద్‌

హోలీ పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు బంద్ చేయ‌నున్నారు. ఈ మేర‌కు పోలీసులు మ‌ద్యం దుకాణాదారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎవ‌రైనా ఆదేశాల‌ను బేఖాత‌రు చేసి మ‌ద్యం విక్ర‌యాలు కొన‌సాగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత య‌థావిధిగా మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగించ‌వ‌చ్చని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *