బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగడం లేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సల్మాన్ ఖాన్‌కు ఉన్న శతృత్వానికి ముగింపు పలకాలంటే సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు ఈ బెదిరింపు మెసేజ్ రావడం జరిగింది.‘‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మెసేజ్ పంపించారు. ముంబై పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రత పెంచారు. సల్మాన్ ఖాన్‌కు గతంలో సైతం ఎన్నో బెదిరింపులు రావడం జరిగింది.